భారతదేశం, డిసెంబర్ 10 -- ఓటీటీలోకి మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'థీయావర్ కులై నడుంగ' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఇది సీరియల్ కిల్లర్ చేసే హత్యల చుట్టూ తిరుగుతోంది. మరి ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇందులోనూ తమిళ క్రైమ్ థ్రిల్లర్లకు సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. అలాంటి మరో తమిళ క్రైమ్ థ్రిల్లరే థీయావర్ కులై నడుంగ. ఇది ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. డిసెంబర్ 12 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి ఇది తమిళ భాషలో మాత్రమే డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులో ఉండనుంది.

క్రైమ్ థ్రిల్లర్ థీయావర్ కులై నడుంగ సినిమా థియేటర్లో రిలీజైన దాదాపు 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ నవంబర్ 21, 2025న థియే...