Hyderabad, సెప్టెంబర్ 24 -- ఘాటి ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 26) ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ లెక్కన సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మూడు వారాల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడటంతో చాలా ముందుగానే డిజిటల్ ప్రీమియర్ కానుంది.

అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ఘాటి మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఈ శుక్రవారం (సెప్టెంబర్ 26) నుంచే ఆ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. థియేటర్లలో రిలీజ్ సమయంలో మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది. దీంతో కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది....