భారతదేశం, జూలై 5 -- మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రజాదరణ, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు శివసేన వారసత్వం ఉన్న నాయకులు శనివారం చేతులు కలిపారు. శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. శివసేన వారసత్వంపై విబేధాలతో ఈ ఇద్దరు నాయకులు రెండు దశాబ్దాల క్రితం విడిపోయారు.

శనివారం ముంబైలో సోదరుడు రాజ్ ఠాక్రేతో కలిసి జరిగిన రీయూనియన్ ర్యాలీలో ఇద్దరు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ ''అవును, మేం గూండాలమే. న్యాయం కోసం గూండాలుగా మారాల్సి వస్తే గూండాలుగా మారుతాం.. గూండాగిరి చేస్తాం'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరాఠీలో మాట్లాడనందుకు ఠాక్రేల మనుషులు వీధి వ్యాపారులతో సహా ప్రజలను చెంపదెబ్బ కొట్టడం, భయపెట్టడంపై వచ్చిన విమర్శలపై ఉద్ధవ్ పై విధంగ...