భారతదేశం, డిసెంబర్ 11 -- తెలుగులో సీరియల్స్‌తో పాపులర్ అయిన నటుడు అలీ రెజా. పసుపు కుంకుమ, మాటే మంత్రము వంటి సీరియల్స్‌లో అట్రాక్ట్ చేసిన అలీ రెజా బిగ్ బాస్ తెలుగు 3 సీజన్‌లో తనదైన ఆటతో అలరించాడు. అలా బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న అలీ రెజా టాలీవుడ్ సినిమాలు చేస్తూ కొంతకాలం బిజీ అయ్యాడు.

ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత ఓటీటీ సిరీస్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు అలీ రెజా. హీరో వరుణ్ సందేశ్, బిగ్ బాస్ ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ నయనం. సైకో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నయనం సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు.

నయనం సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలీ రెజా కనిపించాడు. ఇటీవల నయనం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చే...