Hyderabad, ఆగస్టు 31 -- సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఎట్టకేలకు ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకుంది. కానీ, సిద్ధార్థ్, జాన్వీ కపూర్ జంట కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది. అయితే, బాక్సాఫీస్ వద్ద పరమ్ సుందరి సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది.

అలాగే, మొదటి శనివారం (ఆగస్ట్ 30) కూడా బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిలుపుకోగలిగింది పరమ్ సుందరి. ట్రేడ్ సంస్థ సక్నిక్ ప్రకారం పరమ్ సుందరి మొదటి రోజు రూ. 7.25 కోట్లు సంపాదించింది. ఇది సిద్ధార్థ్ కెరీర్‌లో 5వ అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసిన సినిమాగా పేరు తెచ్చుకుంది.

ఇక రెండో రోజు పరమ్ సుందరి సినిమా భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 9.22 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే, మొదటి రోజుతో పోలిస్తే...