Hyderabad, ఆగస్టు 8 -- తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్​‌స్టాప్​ వినోదం అందించే జీ తెలుగు ఈ వారాంతంలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. చిన్న పిల్లల్లోని టాలెంట్‌​ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్​‌ఫుల్​ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్​ 8 తుది అంకానికి చేరుకుంది.

ఆలోచింపజేసే స్కిట్స్​, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన డ్రామా జూనియర్స్​ సీజన్​ 8 గ్రాండ్​ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది. అంతేకాదు, కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాని టీవీ ప్రీమియర్ చేయనుంది జీ తెలుగు.

డ్రామా జూనియర్స్​ సీజన్​ 8 గ్రాండ్​ ఫినాలే పార్ట్​ 1 ఆగస్టు 9 శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అలాగే, రొమాంటిక్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా ఆద...