భారతదేశం, జనవరి 9 -- తెలుగులో కామెడీ డ్రామాగా వచ్చిన సినిమా జిగ్రీస్. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో కిరణ్ అబ్బవరం సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. నలుగురు స్నేహితుల కామెడీ ట్రిప్‌గా సాగే జిగ్రీస్ ఓటీటీల్లో దూసుకుపోతోంది. ఏకంగా రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో నవ్విస్తూ దూసుకుపోతోంది జిగ్రీస్ మూవీ.

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో జిగ్రీస్ సినిమాను ఎగబడి చూస్తున్నారు. కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు.

కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ ...