Andhrapradesh,vijayawada, జూలై 13 -- కోటా శ్రీనివాసరావు.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. పాత్ర ఏదైనా సరే. తనదైన ముద్రను వేస్తారు. అలాంటి కోటా. రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారు. భారతీయ జనతా పార్టీలో పని చేసిన ఆయన. ఓసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన కోటా. నటుడిగానే కొనసాగారు.

ఓవైపు టాలీవుడ్ లో నటుడిగా అగ్ర స్థానంలో కొనసాగుతున్న రోజుల్లోనే కోట రాజకీయాలోకి వచ్చారు. కోటకు బీజేపీ అంటే చాలా ఇష్టం. ఆ పార్టీకి అగ్రనేత అయిన మాజీ ప్రధాని వాజ్‌పేయిని చాలా అభిమానించేవారు. దీనికితోడు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యా సాగర్ ప్రోత్సాహంతో బీజేపీ పార్టీలో చేరారు. దీంతో ఆయన పొలిటికల్ కేరీర్ కు బీజం పడినట్లు అయింది.

బీజేపీలో చేరిన కోటకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది. బీజేపీ తరపున 1999లో విజయవాడ తూర్పు నియోజ...