Hyderabad, ఆగస్టు 4 -- బాలీవుడ్‌లోనే కాదు ఇండియాలోనే అతిపెద్ద స్టార్లలో ఒకరు దీపికా పదుకోన్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఈ నటి, ఇటీవల అత్యంత నమ్మదగిన స్టార్లలో ఒకరిగా ఎదిగింది. ఈ మధ్య ఆమె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో స్టార్ పొందిన మొదటి భారతీయ నటిగా నిలిచింది. ఇప్పుడు ఆమె మరో వరల్డ్ రికార్డును సాధించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ ఒకటి 1.9 బిలియన్ల వ్యూస్ అధిగమించి, ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన రీల్‌గా నిలిచింది.

దీపికా పదుకోన్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. 80 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల గురించి, రాబోయే సినిమాలు, ఫోటోషూట్‌లు, తన బ్రాండ్‌ల గురించి, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన క్షణాలను పంచుకోవడానికి ఉపయోగిస్తుంది. అనేక అంతర్జాతీయ బ్రాండ్‌లకు గ్లోబల్...