Hyderabad, ఆగస్టు 15 -- టాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పాత వీడియోపై స్పందించింది. 19 ఏళ్ల వయసులో ఒక టీవీ ఇంటర్వ్యూలో బిపాషా బసు శరీరం గురించి ఆమె చేసిన ఒక జోక్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆ కామెంట్స్ పై ఆమె ఇప్పుడు పశ్చాత్తాపపడుతూ క్షమాపణ చెప్పింది.

బిపాషాపై తాను చేసిన కామెంట్స్ కు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్ చేసింది. "19 ఏళ్ల వయసులో నేను చాలా సిల్లీ విషయాలు మాట్లాడాను. నా మాటల తీవ్రత, సరదాగా మాట్లాడినప్పటికీ అవి ఎంత బాధ కలిగిస్తాయో అప్పట్లో నాకు తెలియలేదు. అయితే అవి బాధ కలిగించాయి. అందుకు నేను క్షమపణ కోరుతున్నాను.

ఎవరినీ బాడీ షేమింగ్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. అది ఒక ఇంటర్వ్యూలో సరదాగా చేసిన జోక్. అది హద్దులు దాటింది. కానీ అది సరి కాదని నాకు అర్థమ...