భారతదేశం, డిసెంబర్ 23 -- మలయాళం సినిమాలకు తెలుగులో క్రమంగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు. కానీ అక్కడి ఇండస్ట్రీ మాత్రం నష్టాల ఊబిలో నుంచి బయటపడటం లేదు. 2025లోనూ అక్కడి మూవీ ఇండస్ట్రీ కష్టాలు కొనసాగినట్లు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.

నిజానికి 2025లో మలయాళ సినిమా ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోకా' సినిమా ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. మోహన్‌లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్, తుడరుమ్ కూడా బాగానే రాణించాయి. కానీ ఓవరాల్‌గా చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఏడాది విడుదలైన 184 సినిమాల్లో హిట్స్ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. దీంతో నిర్మాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు.

మలయాళ చిత్ర పరిశ్రమ 2025లో ఒక అద్భుతమైన మైలురాయిని దాటింది. కానీ తెర వెనుక పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది. కేరళ ఫిల్మ్ ఛాం...