భారతదేశం, జూలై 7 -- ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పంతో చేపట్టిన 'వనమహోత్సవం-2025' కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "వనమే మనం. మనమే వనం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది" అంటూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒ...