భారతదేశం, నవంబర్ 9 -- 18 ఏళ్ల క్రితం రిలీజైన షారుక్ ఖాన్ 'చక్ దే ఇండియా' మూవీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ టాప్ 10లో ఈ రోజు (నవంబర్ 9) ఆ మూవీ ఉండటం విశేషం. 2007లో రిలీజైంది చక్ దే ఇండియా. ఇందులో అమ్మాయిల టీమ్ ను ఛాంపియన్ గా నిలిపే కోచ్ గా షారుక్ ఖాన్ నటించాడు. రీసెంట్ గా టీమిండియా అమ్మాయిల ప్రపంచకప్ గెలవడం, ఇండియా హాకీకి వందేళ్ల కారణంగా చక్ దే ఇండియా ట్రెండింగ్ లో వచ్చింది.

కాశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం బారాముల్లా. ఇది నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ ఫిల్మ్. డైరెక్ట్ గా నవంబర్ 7న ఓటీటీలో రిలీజైంది. కథ, సినిమాటోగ్రఫీ కారణంగా వార్తల్లో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది ఈ రోజు నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఆరిఫ్ మీర్జా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇమాద్ షా, సయానీ గుప్తా అద్భుతంగా నటించారు.

దక...