Andhrapradesh,delhi, జూలై 17 -- స్వర్ణాంధ్ర 2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళికగా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది.

మొత్తం 120 సిఫార్సులను పొందుపరచిన ఈ నివేదికను టాస్క్ ఫోర్సు బృందం రూపొందించింది. మొత్తం 17 రంగాలకు సంబంధించి అమలు చేయాల్సిన సిఫార్సులను టాస్క్ ఫోర్సు ఇందులో నివేదించింది. ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక ఆవిష్కరణ అనంతరం సీఎం పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆర్ధిక పారిశ్రామిక అభివృద్ధి నివేదికను రూపొందించిన టాస్క్ ఫోర్సు సభ్యుల్ని ముఖ్యమంత్రి అభినందించారు. మరోవైపు ఏపీలో వచ్చే పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్...