భారతదేశం, జనవరి 8 -- దేశానికి పతకాలు తీసుకురావాల్సిన క్రీడాకారులకు రక్షణగా ఉండాల్సిన కోచ్‌.. కీచకుడిలా ప్రవర్తించాడు. ఒక మైనర్ షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడి క్రీడా ప్రపంచం తలదించుకునేలా చేశాడు. నేషనల్ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్‌పై హర్యానా పోలీసులు అత్యాచారం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు.

న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయ స్థాయి షూటింగ్ పోటీలు జరుగుతున్న సమయంలో ఈ అమానుషం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నీ ఆటతీరు (Performance) ఎలా ఉందో చర్చిద్దాం అని నమ్మబలికిన కోచ్ అంకుష్ భరద్వాజ్, ఆమెను ఫరీదాబాద్‌లోని ఒక హోటల్ గదికి పిలిపించాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి ఎంత ప్రతిఘటించినా వదలకుండా కిరాతకంగా వ్యవహరించాడు.

ఈ ఘోరం గురించి ఎవరికైనా చెబితే నీ కెరీర్ నాశనం చేస్తానని, న...