Hyderabad, అక్టోబర్ 13 -- బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా ఖిలాడీ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ పేరు తెచ్చుకున్నారు. 90స్ నుంచి ఎన్నో చిత్రాలు చేస్తూ అభిమానులను, ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. రియల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్య పరిచే అక్షయ్ కుమార్, యాక్టింగ్‌తో అదరగొట్టే సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కలిసి మరోసారి వెండితెరపై దర్శనం ఇవ్వనున్నారు.

అయితే, సుమారు 17 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్నారు. వీరిద్దరిని ఒక్కటిగా చేసిన సినిమా హైవాన్. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న హైవాన్ మూవీకి ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.

హైవాన్ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. ఇటీవల "హైవాన్" సిన...