భారతదేశం, జూలై 24 -- భారతదేశంలో ఇప్పటిదాకా 16సార్లు ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. అందులో 12సార్లు అభ్యర్థులు పోటీ పడ్డారు. నాలుగుసార్లు మాత్రం ఏకగ్రీవం జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం..

1952 నుండి 1962 వరకు రెండు పర్యాయాలు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్. రెండు ఎన్నికలలోనూ పోటీ లేకుండానే విజయం సాధించారు. 1952లో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నుండి జనాబ్ షేక్ ఖాదిర్ హుస్సేన్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఆయన నామినేషన్ తిరస్కరణ గురికావడంతో రాధాకృష్ణన్ ఏకగ్రీవమయ్యారు.

1979లో ప్రముఖ న్యాయనిపుణుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ హిదయతుల్లా ఉప రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా, ఉపాధ్యక్షుడిగా, తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసిన ప్రత్యేకతను హిదాయతుల్లా కలిగి ఉన్నారు. 1969లో వి.వి.గిరి తాత్కాల...