భారతదేశం, జూన్ 29 -- శనివారం హైదరాబాద్ లో జరిగిన దిల్ రాజు డ్రీమ్స్ ప్రారంభోత్సవంలో హీరో విజయ్ దేవరకొండ సినీ పరిశ్రమలో తన ప్రస్థానం గురించి మాట్లాడాడు. శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా కోసం 16 వేల మంది ఆడిషన్స్ కు వస్తే.. అందులో నుంచి సెలెక్ట్ అయ్యానని విజయ్ చెప్పాడు. ఆ సినిమా తన జీవితాన్ని ఎలా మార్చేసిందో గుర్తు చేసుకున్నాడు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కోసం ఆడిషన్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తాను సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే తపన గురించి స్టేజ్ పై మాట్లాడాడు. "కాస్టింగ్ కాల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి 2011 లేదా 2012లో ఐడిల్ బ్రైన్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడున్నంతగా సోషల్ మీడియా ఉండేది కాదు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తీస్తున్న విషయం నాకు బాగా గుర్తుంది. ఆయన హ్యాపీడేస్ (2007) తీసినప్...