భారతదేశం, జూలై 31 -- 16 ఏళ్లలోపు టీనేజర్‌లను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా, ఇప్పుడు ఆ జాబితాలోకి యూట్యూబ్‌ను కూడా చేర్చింది. గతంలో,16 సంవత్సరాల లోపు వారికి సోషల్ మీడియా ఖాతాలను నిషేధించే ఈ చట్టం నుంచి యూట్యూబ్‌కు మినహాయింపు ఇవ్వాలని అధికారులు భావించారు. ఎందుకంటే, వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌లో విద్యా సంబంధిత కంటెంట్ ఉందని వారు పేర్కొన్నారు. కానీ, యూట్యూబ్‌లో కూడా టీనేజర్‌లకు హాని కలిగించే ప్రమాదాలు ఉన్నాయని ఆధారాలు లభించడంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. యూట్యూబ్, ఆల్ఫాబెట్ సంస్థలోని గూగుల్ కి చెందినది.

"సోషల్ మీడియా వల్ల సామాజిక హాని జరుగుతుందని మనకు తెలుసు" అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. "యువ ఆస్ట్రేలియన్లను రక్షించడానికి నా ప్రభుత్వం, ఈ పార్లమెంట్ చర్యలు తీసుకోవడానికి సి...