భారతదేశం, నవంబర్ 10 -- రష్మిక మందన్నా వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది. రష్మిక హిందీలో నటించిన హారర్ కామెడీ సినిమా థామా. ఇందులో బేతాళిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేసిన థామా మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU)లో భాగంగా విడుదలైన విషయం తెలిసిందే.

అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైన థామాకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. థామా సినిమా ఇప్పటికే 20 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. అంటే వంద కోట్ల క్లబ్‌ను దాటిసే ఇప్పుడు రూ. 200 కోట్ల మార్కు వైపునకు థామా పరుగెడుతోంది.

దీంతో మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్ల మైలురాయిని దాటేసింది. శ్రద్ధా కపూర్ స్త్రీ మూవీతో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీలో ముంజ్యా, భేడియా, స్త్రీ 2 సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అదిర...