భారతదేశం, ఆగస్టు 13 -- కూలీ సినిమా విడుదల కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకు కౌంట్ డౌన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ట్రైలర్ లో దహాగా తన ఇంటెన్సివ్ అవతారంతో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఈ చిత్రంలో ఒక హైలైట్ గా నిలిచాడు. అయితే ఈ సినిమాలో తన క్యామియో కోసం ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

కూలీ సినిమాలో ఆమిర్ ఖాన్ క్యామియో 15 నిమిషాల నిడివి ఉండబోతోంది. ఈ స్పెషల్ క్యారెక్టర్ కోసం ఆమిర్ ఖాన్ రూ.20 కోట్లు తీసుకున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అసలు నిజం ఏమిటంటే? ఈ కూలీ మూవీ కోసం ఆమిర్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సినిమా కోసం ఆమిర్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. రజనీకాంత్, కూలీ టీంపై అమీర్ ఖాన్ కు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. పూర్...