భారతదేశం, నవంబర్ 24 -- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ సాహో సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. ఆ తర్వాత తెలుగు సినిమా చేయని ఈ బ్యూటి హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అయితే, రీసెంట్‌గా శ్రద్ధా కపూర్ షూటింగ్ సెట్‌లో గాయపడింది.

శ్రద్ధా కపూర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఈఠా. నవంబర్ 22న ఈఠా సెట్‌లో శ్రద్ధా కపూర్ గాయపడినట్లు పలు మీడియా కథనాలు వచ్చాయి. తాజాగా తన గాయంపై హెల్త్ అప్డేట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్. కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు శ్రద్ధా కపూర్ చెప్పుకొచ్చింది.

అలాగే, తన అప్‌కమింగ్ సినిమా గురించి వెల్లడించింది శ్రద్ధా కపూర్. అయితే, శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ క్వషన్ సెషన్‌ను నిర్వహించింది. అందులో అనేక అభిమానుల ప్రశ్నలకు శ్రద్ధా సమాధానం ...