భారతదేశం, జూలై 22 -- ఒడిశాలోని జాజ్ పూర్ లో 15 ఏళ్ల మహిళా హాకీ ట్రైనీని ఆమె కోచ్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరానికి ఆమె ఇద్దరు మాజీ కోచ్ లు కూడా సహకరించారని పోలీసులు మంగళవారం తెలిపారు. జూలై 3న జరిగిన ఈ ఘటన బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేసిన తర్వాతే వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆమె శిక్షణ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా కోచ్, అతని అనుచరులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే, ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని నేరంలో పాలుపంచుకున్నట్లు సరైన ఆధారాల...