భారతదేశం, జూలై 20 -- తెలుగులో మరో బయోపిక్ రాబోతోంది. తెలుగు మహిళ, బుర్ర కథతో ఫేమస్ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథతో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ఆమె పేరే పెట్టారు. 'గరివిడి లక్ష్మి' మూవీలో ఆనంది టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను ఆదివారం (జూలై 20) రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

గతంలో విజయనగరం జిల్లా గరివిడి వాస్తవ్యురాలు లక్ష్మి పేరు ఎక్కువగా వినిపించేదే. ఆమె బుర్ర కథ షోలు చాలా పాపులర్. 15 ఏళ్లలో 10 వేల స్టేజీ షోలు ఇచ్చింది. 1990ల్లో ఆమె ఆడియో క్యాసెట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన క్యాసెట్లుగా నిలిచాయి. గరివిడి లక్ష్మి అంటే అంత ఫేమస్. ఉత్తరాంధ్రలో పండగలు, ఉత్సవాలు ఇలా ఏ సందర్భమైనా గరివిడి లక్ష్మి బుర్ర కథ ఉండాల్సిందే.

గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది క్యూట్ గా కనిపిస్తోంది. ఫస్ట్ ...