భారతదేశం, నవంబర్ 18 -- 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చే 'బాల్' లేదా నీలి రంగు ఆధార్ కార్డుల కోసం చేసే తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్స్ (MBU) ఇప్పుడు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయని UIDAI అధికారిక ప్రకటన తెలిపింది.

పిల్లలకు 5 నుంచి 7 ఏళ్ల మధ్య చేసే మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU 1), 15 నుంచి 17 ఏళ్ల మధ్య చేసే రెండో బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU 2).. ఈ రెండు అప్‌డేట్స్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

ఈ నిర్ణయం అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉచిత సదుపాయం సరిగ్గా ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత, ప్రతి MBUకి రూ. 125 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ తాజా చర్యతో సుమారు 6 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది.

UIDAI ప్రకారం, MBU అనేది 5 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న భారతీయ పిల్లల నీలి రంగు ఆధార్ కార్డుల కోసం చేసే ...