Hyderabad, ఆగస్టు 9 -- మహావతార్ నరసింహ 15 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్: డివోషనల్ సినిమా మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన పౌరాణిక యానిమేటెడ్ చిత్రం 'మహావతార్ నరసింహ' శుక్రవారం మూడో వారంలోకి ప్రవేశించింది.

విష్ణువు మూడు, నాల్గవ అవతారాల శక్తివంతమైన కథలను చిత్రీకరించిన ఈ కన్నడ చిత్రం కలెక్షన్స్ 15వ రోజు 51.40 శాతం పెరిగిపోయాయి. రక్షా బంధన్ సెలవులకు ఒక రోజు ముందు ఈ చిత్రం గణనీయమైన వసూళ్లను సాధించింది.

మహావతార్ నరసింహ సినిమా 15వ రోజున అంటే శుక్రవారం నాడు ఇండియాలో రూ. 8.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ తెలిపింది. దీంతో 15 రోజుల్లో ఇండియాలో ఈ సినిమా రూ. 126.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

జూలై 25న విడుదలైన ఈ యానిమేటెడ్...