భారతదేశం, డిసెంబర్ 2 -- యువ సంచలనం వైభవ్​ సూర్యవంశీ మరోసారి దుమ్మురేపి వార్తల్లో నిలిచాడు! ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మహారాష్ట్రపై మెరుపు శతకం బాదాడు. ఎలైట్ గ్రూప్ బీ పోరులో, టాస్ గెలిచి మహారాష్ట్ర బౌలింగ్ ఎంచుకోగా, బిహార్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ టీనేజ్ సంచలనం 61 బంతుల్లో అద్భుతమైన 108 పరుగులు చేసి, ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు క్రీజులో నిలబడ్డాడు. దీనితో బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 176/3 పరుగులు చేసింది.

సూర్యవంశీ కేవలం 57 బంతుల్లోనే తన తొలి ఎస్ఎమ్ఏటీ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 177.05గా ఉంది. వికెట్‌పై చాలా మంది బ్యాటర్లు బంతిని సరిగ్గా అంచనా కూడా వేయడానికి కష్టపడుతున్న సమయంలో, బిహార్ మొత్తం స్కోరులో...