భారతదేశం, నవంబర్ 10 -- ప్రజారోగ్య సంరక్షణను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 142 సెకండరీ స్థాయి ఆసుపత్రులలో 227 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో నిపుణుల కొరతను గణనీయంగా తగ్గించేందుకు ఇటీవలే ఇన్-సర్వీస్ కోటా కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు పూర్తి చేసిన వైద్యులను ఈ నియామకాలకు ఎంపిక చేసినట్టుగా ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.

డైరెక్టర్లు డాక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు(సెకండరీ హెల్త్), డాక్టర్ పద్మావతి (పబ్లిక్ హెల్త్) పోస్టుల గురించి మంత్రికి వివరించారు. ఈ పోస్టింగ్‌లలో గైనకాలజీ, జనరల్ మెడిసిన్‌లో 35, జనరల్ సర్జరీలో 30, అనస్థీషియాలో 26, పీడియాట్రిక్స్‌లో 25, ఆర్థోపెడిక్స్‌లో 18, రేడియాలజీలో 17, ఆప్తాల్మాలజీలో 15, ఇఎన్‌టీలో తొమ్మిది ఉన్నాయి.

అవసరాన్ని బట్టి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల...