భారతదేశం, జనవరి 25 -- అభిషేక్ శర్మనా మజానా! అతని చేతిలోని బ్యాట్ మంత్రదండంలా మారి బంతిని పదేపదే స్టాండ్స్ లోకి పంపించేసింది. పూనకం వచ్చినట్లు ఊగిపోయిన ఈ టీమిండియా ఓపెనర్ న్యూజిలాండ్ బౌలింగ్ ను చిత్తుగా కొట్టాడు. ఆదివారం న్యూజిలాండ్ తో మూడో టీ20లో అభిషేక్ శర్మ 14 బాల్స్ లోనే ఫిఫ్టీ సాధించేశాడు. తన గురువు యువరాజ్ సింగ్ రికార్డుకు 2 బంతుల దూరంలో ఆగిపోయాడు.

ఆదివారం (జనవరి 25) న్యూజిలాండ్ తో మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు అభిషేక్ శర్మ. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఓ ఫుల్ మెంబర్ టీమ్ పై టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ లో అభిషేక్ గురువు యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) ఉన్నాడు. యూవీ రికార్డును జస్ట్ 2 బంతుల తేడాతో మిస్ అయ్యాడు అభిషేక్.

అభిషేక్ తన మొదట...