భారతదేశం, నవంబర్ 27 -- సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు (నవంబర్ 27, గురువారం) సరికొత్త ఉత్సాహాన్ని నింపుకుంది. దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 (Nifty 50) మళ్లీ కొత్త జీవితకాల గరిష్టాన్ని (Life-time High) తాకింది.

ముఖ్యంగా, ఈ రోజు నిఫ్టీ 50 ఇండెక్స్ ఒకానొక దశలో 26,295.55 రికార్డు స్థాయికి చేరుకుంది. గతంలో 2024 సెప్టెంబర్‌లో నమోదైన 26,277.35 పాత గరిష్టాన్ని నిఫ్టీ సులభంగా అధిగమించింది.

నిఫ్టీతో పాటు బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) కూడా 200 పాయింట్లకు పైగా లాభపడింది. ఇది తాజాగా 85,940.24 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. 30 షేర్ల ఈ ఇండెక్స్ దాని రికార్డు స్థాయికి కేవలం 38 పాయింట్ల దూరంలో ఉంది. 2024 సెప్టెంబర్ 27న సెన్సెక్స్ 85,978.25 వద్ద అత్యధిక స్థాయిని తాక...