భారతదేశం, జనవరి 3 -- అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ప్రేక్ష‌కుల్లోనే కాకుండా సినీ వ‌ర్గాల్లోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా ద్రౌపది 2. మోహ‌న్‌.జి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

14వ శ‌తాబ్దంలో ద‌క్షిణ భార‌త‌దేశపు నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ద్రౌపది 2 సినిమాను భారీ బ‌డ్జెట్‌తో బ‌హుభాషా చిత్రంగా రూపొందించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.

రిచ‌ర్డ్ రిషి లుక్‌, చ‌క్క‌టి పాట‌లు, విజువల్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచాయి. ద్రౌపది 2 సినిమాలో చిరాగ్ జానీ విల‌న్‌గా న‌టిస్తుండటం అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. అంతేకాకుండా ద్రౌపది 2లో ముగ్గురు విలన్స్ ఉండటం విశేషంగా మారింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌క...