భారతదేశం, నవంబర్ 11 -- బిహార్ ఎన్నికల​ రెండో దశ పోలింగ్​ ప్రక్రియ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ఓటింగ్​కు అదనపు సమయాన్ని కేటాయిస్తామని ఎన్నికల సంఘ స్పష్టం చేసింది. కాగా దిల్లీ పేలుడు నేపథ్యంలో బిహార్​లో అప్రమత్తమైన అధికారులు.. ఎన్నికల వేళ భద్రతను మరింత పెంచారు.

నవంబర్ 6న జరిగిన బిహార్​ ఎన్నికల తొలి దశ పోలింగ్ 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాలను కవర్ చేసింది. ఇందులో 65.08% ఓటింగ్ నమోదైంది. ఇది బిహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం కావడం విశేషం. అయితే ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్​ఐఆర్​) కారణంగా మొత్తం ఓటర్ల సంఖ్య 7.89 కోట్ల నుంచి 7.42 కోట్లకు తగ్గడం గమనార్హం.

ఇక మంగళవారం మొత్తం 20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ నియో...