భారతదేశం, అక్టోబర్ 12 -- కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ ఇప్పుడు వైరల్ గా మారింది. 2024లో థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తో అదరగొట్టిన ఈ హిందీ కామెడీ డ్రామా ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. 2025 ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఈ మూవీ ఏకంగా 13 అవార్డులు గెలుచుకోవడమే అందుకు కారణం. ఓ ఏడాది ఫిల్మ్ ఫేర్ లో అత్యధిక అవార్డులు గెలిచిన మూవీగా రికార్డును ఇది సమం చేసింది.

ఫిల్మ్ ఫేర్ 2025లో 13 అవార్డులు గెలుచుకున్న లాపతా లేడీస్ అధికారికంగా ఆస్కార్ 2025 కు నామినేట్ కూడా అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. ఈ హిందీ మూవీ ఇంగ్లీష్, అరబిక్, స్పానిష్, చైనీస్, బ్రెజిలియన్ పోర్చుగీస్ సబ్ టైటిల్స్ తో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 2 నిమిషాలు.

2024 మార్చి 1న లాపతా లేడీ...