భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఓటీటీలోకి మరో తమిళ హారర్ థ్రిల్లర్ దూసుకొచ్చింది. అదిరిపోయే సస్పెన్స్ తో ఆడియన్స్ ను భయపెట్టేందుకు 'ది డోర్' (The Door) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీలో అదరగొడుతోంది. క్యూట్ బ్యూటీ భావన 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి కోలీవుడ్ లో అడుగుపెట్టడం విశేషం. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది? దీని కథ ఏంటో తెలుసుకుందాం.

తమిళ హారర్ థ్రిల్లర్ ది డోర్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 29నే ఓటీటీ రిలీజైంది. ఆహా తమిళ్ లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడైతే తమిళంలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఓటీటీలో ఈ మూవీ సత్తాచాటుతోంది. హారర్ తో ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది.

ది డోర్ మూవీలో హీరోయిన్ భావన లీడ్ రోల్ ప్లే చేసింది. 13 ఏళ్ల తర్వాత తిరిగి తమిళంలో ఆమె చేసిన సినిమా ఇది...