భారతదేశం, ఆగస్టు 9 -- హీరో మోటోకార్ప్ 125 సిసి మోటార్ సైకిల్ సెగ్మెంట్లో తన పట్టును తిరిగి పొందడానికి సన్నద్ధమవుతోంది. 2025లో రెండు కొత్త బైక్‌లను విడుదల చేయనుంది. మీడియా నివేదికల ప్రకారం, హీరో రాబోయే బైక్ ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. జూలై నెలలో రిటైల్ అమ్మకాల పరంగా హోండా.. హీరోను అధిగమించిన సమయంలో ఈ న్యూస్ వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పండుగ సీజన్ లో పెరుగుతున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంగా హీరో ఈ వ్యూహాన్ని అనుసరించనుంది. ప్రస్తుతం హీరో 125 సీసీ సెగ్మెంట్‌లో గ్లామర్, సూపర్ స్ప్లెండర్, ఎక్స్ ట్రీమ్ 125ఆర్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఈ మూడు బైకులు వేర్వేరు టార్గెట్ ఆడియన్స్ కోసమేనని కంపెనీ చెబుతోంది. పెర్ఫార్మెన్స్ కోసం ఎక్స్ ట్రీమ్, స్టైల్ కోసం గ్లామర్, మైలేజ్ కోసం సూపర్ స్ప్లెండర్ బాగుంటాయి. ...