Hyderabad, సెప్టెంబర్ 28 -- ఓజీ డే 3 బాక్సాఫీస్ కలెక్షన్: పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ బాక్సాఫీస్ వద్ద తన పట్టును కొనసాగిస్తోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమాను గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలిచారు. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఓజీ మంచి టాక్ తెచ్చుకుంటోంది.

ఈ క్రమంలోనే తొలి రోజున భారీ వసూళ్లు సాధించిన ఓజీ మూవీ రెండో రోజు కలెక్షన్లలో తగ్గుదల చూపించింది. కానీ, రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మూడో రోజున కూడా అతి స్వల్పంగా ఓజీ మూవీ కలెక్షన్స్ తగ్గాయి.

మూడో రోజు అయిన శనివారం (సెప్టెంబర్ 27) నాడు ఇండియాలో రూ. 18.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఓజీ (OG) సినిమా. స్పెషల్ ప్రీమియర్స్ నుంచి 3 రోజుల వరకు భారత్‌లో ఓజీ రాబట్టి నికర కలెక్షన్స్ ...