Hyderabad, జూన్ 25 -- మంచు విష్ణు టెంపుల్ రన్ ముగిసింది. తన కన్నప్ప మూవీ కోసం అతడు కొన్నాళ్లుగా దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం తిరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి బుధవారం (జూన్ 25) శ్రీశైలంలో ఈ పర్యటన ముగిసింది. ఈ విషయాన్ని అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. కన్నప్ప మూవీ శుక్రవారం (జూన్ 27) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

మంచు విష్ణు తన జ్యోతిర్లింగాల దర్శనాన్ని పూర్తి చేసుకున్నాడు. బుధవారం (జూన్ 25) అతడు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాడు. ఆ తర్వాత తన ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. తన పర్యటన ముగిసినట్లు వెల్లడించాడు.

"ఒక ఆధ్యాత్మిక ప్రయాణం.. పన్నెండు జ్యోతిర్లింగాలు.. ఇది నిజంగా ఓ అద్భుత అనుభూతి! తాజాగా, శివుడి పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్...