Andhrapradesh, సెప్టెంబర్ 11 -- రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీల విషయంపై ప్రభుత్వం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

పల్నాడు జిల్లా కలెక్టర్ గా కృతిక శుక్లా నియమితులు కాగా. బాపట్ల జిల్లా కలెక్టర్ గా వినోద్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రకాశం జిల్లాకు రాజాబాబు, నెల్లూరు జిల్లాకు హిమాంశు శుక్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.

ఇటీవలనే 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా ఏపీ సర్కార్ బదిలీ చేసింది. ఇందులో భాగంగా టీటీడీ ఈవోగా అనిల్ కుమార్‌ సింఘాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.

రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును న...