Telangana,hyderabad, అక్టోబర్ 3 -- ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన సముదాయ నిర్మాణ పనులు దసరా పండగ వేళ ప్రారంభయమయ్యా. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ (ఎం ఈ ఐ ఎల్ ) ప్రాజెక్టుల విభాగం అధ్యక్షులు కె. గోవర్ధన్ రెడ్డి గురువారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ భవనాల నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దసరా నాడు ప్రారంభమైన పనులు ఇక శరవేగంగా జరగనున్నాయి.

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం రెండున్నర ఏళ్లలో పూర్తి కానున్నాయి. నూతన భవనాల సముదాయాన్ని 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో అభివృద్ధి చేయనున్...