భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ)ను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సంఘాల ప్రధాన డిమాండ్లపై ఏప్రిల్ 3న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ, ఐఆర్ డిమాండ్ల నేపథ్యంలో మీరు తెలుసుకోవాల్సిన 10 కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి.

ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన 11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) గడువు 2023 జూలై 1 నాటికి ముగిసింది. తదుపరి 12వ పీఆర్‌సీని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే 12వ పీఆర్‌సీని ఏర్పాటు చేసి, దానికి చైర్మన్‌ను నియమించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ స...