భారతదేశం, అక్టోబర్ 3 -- చాలామంది ప్రజలు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. దానికి రహస్యం ఏమై ఉంటుందని అన్వేషిస్తుంటారు. తాజాగా, ఒక అమెరికన్-స్పానిష్ వృద్ధురాలు మారియా బ్రాన్యాస్ మోరర్ జీవితశైలిని పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈమె 117 ఏళ్ల 168 రోజుల వయసులో, 2024 ఆగస్టులో మరణించారు. అప్పటికి ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు.

సెప్టెంబర్ 24న 'సెల్ రిపోర్ట్స్ మెడిసిన్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, పరిశోధకులు బ్రాన్యాస్ రక్తం, లాలాజలం, మూత్రం, మలం, జీనోమ్‌లను అధ్యయనం చేశారు.

బ్రాన్యాస్ ధూమపానం చేయలేదు, మద్యం తాగలేదు. అలాగే గ్రామీణ ప్రాంతంలో జీవించారు. మితమైన వ్యాయామం, ఆలివ్ ఆయిల్ (నూనె) కలిగిన మెడిటేరియన్ తరహా ఆహారాన్ని తీసుకునేవారు. అయితే, ఆమె జీవనశైలిలో కొంచెం అసాధారణమైన ఒక విషయం ఉంది. అదేమిటంట...