Hyderabad, మే 5 -- ఓటీటీల్లో ఎన్నో రకాల చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు సైతం ఓటీటీలో అలరిస్తుంటాయి. ఇలాంటి ఎక్స్‌పరిమెంటల్ మూవీస్ ఎక్కువగా మలయాళం, హాలీవుడ్‌లో మాత్రమే వస్తాయని అపోహ ఉంది. కానీ, తెలుగులో కూడా ప్రయోగాత్మక చిత్రాలు ఎప్పుడో వచ్చాయి.

అందుకు ఉదాహరణే మను మూవీ. 2018లో వచ్చిన మను మూవీ తెలుగు లాంగ్వేజ్ ఎక్స్‌పరిమెంటల్ రొమాంటిక్ ఆర్ట్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. ఈ సినిమాతో ఫణీంద్ర నర్సెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. అంతేకాకుండా మను మూవీలో బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.

వీరితోపాటు అభిరామ్ వర్మ, కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ మోహన్ భగత్, జాన్ కొట్టోలి, అప్పాజీ అంబరీష దర్బ, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్, మిస్టరీ, సస్పెన్స్, మెలో ...