భారతదేశం, ఏప్రిల్ 19 -- ేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను వెల్లడించింది. 100 శాతం పర్సంటైల్ 24 మందికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా టాప్ లిస్టులో ఉన్నారు. అయితే పరీక్ష ప్రక్రియలో నకిలీ పత్రాలు, ఫోర్జరీ, అక్రమాలకు పాల్పడ్డానికి 110 మంది అభ్యర్థుల ఫలితాలను ఎన్టీఏ నిలిపివేసింది.

ఈ 110 మంది అభ్యర్థులతోపాటుగా సరిగాలేని ఫొటోలు, బయోమెట్రిక్ డేటాతో సహా వ్యక్తిగత వివరాలలో వ్యత్యాసం కారణంగా మరో 23 మంది ఫలితాలను కూడా నిలిపి వేశారు. అయితే వీరి ఫలితాలు వెల్లడించడానికి గెజిటెడ్ ఆఫీసర్‌ ధృవీకరించిన గుర్తింపు రుజువును సమర్పించాలి.

దేశంలో కఠినంగా జరిగే ప్రవేశ పరీక్షల్లో జేఈఈ ఒకటి. ఎన్టీఏ చాలా పకడ్బందీగా ఈ పరీక్షను ప్లాన్ చేస్తుంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్, ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణ, సీసీటీవీ నిఘాను ఏర్పాటు...