భారతదేశం, అక్టోబర్ 3 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ విపరీతంగా పెరుగుతోంది. అందమైన శైలి, అద్భుతమైన పనితీరు, ఆచరణాత్మకత కలగలిపిన పలు రకాల మోడల్స్​ని ఆటోమొబైల్​ సంస్థలు అందిస్తున్నాయి. మెరుగైన బ్యాటరీ సాంకేతికత, అందుబాటు ధరల కారణంగా, కొనుగోలుదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో రేంజ్​, స్పీడ్​ లేదా ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ రూ. 1.5 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటే, మీరు పరిగణించాల్సిన కొన్ని అద్భుతమైన ఎలక్ట్రిక్​ స్కూటర్ ఆప్షన్స్​ని ఇక్కడ ఇస్తున్నాము, చూసేయండి..

1. ఏథర్ 450ఎస్ - ధర: రూ. 1.43 లక్షలు

భారతదేశంలో అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏథర్ 450ఎస్ ఒకటి. ఇది 2.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, సమర్థవంతమైన మోటారుతో వస్తుంది. ఇది నగరంలో ప్రయాణాలకే కాకుండా, లాంగ్​ డిస్టెన్స్​ ప్రయాణాలకు కూడా ఉ...