భారతదేశం, ఆగస్టు 28 -- ఐబీపీఎస్ ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ పోస్టులకు అప్లై చేయని వారు వెంటనే చేయాలి. ఎందుకంటే దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28, 2025న ముగుస్తుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 10277 మంది అభ్యర్థులను నియమించనున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే అధికారిక వెబ్సైట్ ibps.in వెళ్లి అప్లికేషన్ ఫామ్ నింపాలి.

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరగనుంది. మెయిన్స్ పరీక్ష నవంబర్ 29న జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు. ఐబీపీఎస్ 2024 సంవత్సరంలో క్లర్క్ పోస్టు పేరును సీఎస్ఏ అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా మార్చింది.

ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ...