భారతదేశం, ఆగస్టు 1 -- ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆసక్తిగల, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అధికారిక వెబ్‌సైట్ ibps.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విండో ఆగస్టు 21 వరకు తెరిచి ఉంటుంది.

ఐబీపీఎస్ 10277 క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరగనుంది. మెయిన్స్ పరీక్ష నవంబర్ 29న జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు. ఐబీపీఎస్ 2024 సంవత్సరంలో క్లర్క్ పోస్టు పేరును సీఎస్ఏ అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా మార్చింది.

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూ...