భారతదేశం, డిసెంబర్ 27 -- భారతీయ సినీ పరిశ్రమ మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం పరిశ్రమంతా మాట్లాడుకునేది ఆదిత్య ధర్ దర్శకత్వంలోని 'దురంధర్' గురించే. రణ్ వీర్ సింగ్ నటించిన ఈ స్పై-యాక్షన్ థ్రిల్లర్ కేవలం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన తొమ్మిదవ భారతీయ చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ నేపథ్యంలో అత్యధిక కలెక్షన్ల ఇండియన్ టాప్-5 సినిమాలపై ఓ లుక్కేయండి.

నితీష్ తివారి దర్శకత్వం వహించిన 'దంగల్' సుమారు రూ.2,070 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లతో, ఇప్పటికీ అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అమీర్ ఖాన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ముఖ్యంగా చైనాలో అపూర్వమైన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అక్కడ లింగ సమానత్వం, పట్టుదల వంటి భావోద్వేగ కథనం, సార్వత్రిక ఇతివృత్తాలు బ...