భారతదేశం, జూన్ 24 -- కుబేర మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నిలకడగా రాణిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతోంది. ఫిల్మ్ రిలీజైన తర్వాత వచ్చిన తొలి సోమవారం (జూన్ 23) కూడా కుబేర కలెక్షన్ల పరంగా సత్తాచాటింది. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే దిశగా ఈ మూవీ సాగుతోంది. కుబేరలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

కుబేర మూవీ జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఇండియాలో రూ.54.77 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. విడుదలైన నాలుగో రోజు కుబేర రూ.5.77 కోట్లు కలెక్ట్ చేసింది. రూ.14.75 కోట్ల కలెక్షన్లతో ప్రారంభమైన ఈ చిత్రం శనివారం 11.86 శాతం పెరిగి రూ.16.5 కోట్లు వసూలు చేసింది....