భారతదేశం, డిసెంబర్ 14 -- దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

దేవాలయాల్లో ఏర్పాటు చేసే ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ స్వయంగా పెంచి, పరిరక్షించి వినియోగించనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు పూర్తిగా అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని బీఆర్ నాయుడు తెలిపారు. సంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఇది నిదర్శనమన్నారు.

ధ్వజస్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదు. అది భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్...