భారతదేశం, జూన్ 16 -- ప్రముఖ పోషకాహార నిపుణురాలు నేహా పరిహార్ జూన్ 14న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో "10-15 కిలోల బరువు తగ్గాలంటే పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. ఖరీదైన పౌడర్లు వాడక్కర్లేదు. రెండు గంటల పాటు వర్కవుట్లు చేయాల్సిన పనీ లేదు" అని స్పష్టం చేశారు. "మీ శరీరానికి వ్యతిరేకంగా కాకుండా, దానికి అనుకూలంగా పనిచేసే ఒక విధానం బరువు తగ్గడంలో నిజంగా ఉపయోగపడుతుంది..' అని ఆమె అంటున్నారు.

బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహారాలను తినకుండా ఆంక్షలు పెట్టుకోవడం లేదా వాటికి భయపడటం మానేసి, పోషకాలు నిండిన ఆహారాలను తీసుకోవడంపై దృష్టి పెట్టాలని నేహా సూచించారు. "ఆహారం తినడానికి.. భయపడటానికి కాదు" అంటూ కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఆమె తన పోస్ట్‌లో పంచుకున్నారు. మీ బరువు తగ్గించే ప్రణాళికలో ఇవి ఉండాలంటూ ఆమె కొన్ని ఆహారాల జాబితా సూచించారు.

ఈ ఆహారాలను మీ ర...